thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 1:50 PM IST

ETV Bharat / Videos

పూరి గుడిసెలో 12 అడుగుల గిరినాగు - భయంతో పరుగులు తీసిన జనం - Big King Cobra in Hut at Anakapalli

Big King Cobra in Hut at Anakapalli District : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడలో భారీ గిరినాగు (కింగ్ కోబ్రా) హల్ చల్ చేసింది. వర్షాలకు ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఎస్సీ కాలనీలోని ఓ పూరి గుడిసెలో గిరినాగు కనిపించింది. అత్యంత ప్రమాదకరమైన గిరినాగు గుడిసెలోని తాటాకుల మధ్య తిష్ట వేసింది. బుసలు కొడుతున్న చప్పుడు రావడంతో పూరిగుడిసెలో నివాసం ఉంటున్న వారు దాన్ని చూశారు. దీంతో వారు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానిక ప్రజలు సైతం భయంతో వణికిపోయారు.  

వెంటనే గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారి ద్వారా విశాఖలోని స్నేక్ క్యాచర్​కు సమాచారం ఇచ్చారు. సుమారు గంట పాటు శ్రమించిన స్నేక్​ స్నాచర్స్​ 12 అడుగుల భారీ గిరినాగును పట్టుకున్నారు. ఓ గోనె సంచిలో బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇంత పెద్ద గిరినాగు ఈ ప్రాంతంలో ఎప్పుడు చూడలేదని స్థానికులు అంటున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.