"ఆంజనేయుడే తరలివచ్చాడా"!- మడేరు వాగు తీరంలో దర్శనమిచ్చిన హనుమాన్ విగ్రహం - Hanuman Idol
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2024, 5:30 PM IST
Hanuman statue At Maderu river : నదులు, వాగులు ఉప్పొంగిన సమయంలో కొన్ని విలువైన వస్తువులు కొట్టుకుని రావడం గతలో మనం వార్తల్లో వినే ఉంటాం. సరిగ్గా ఇలాంటి ఘటనే అల్లూరి జిల్లాలో జరిగింది. ఆంజనేయుని బంగారు వర్ణపు విగ్రహం వాగు ఉధృతిలో కొట్టుకువచ్చింది. ఇసుక మేటలో దర్శనమిచ్చిన హనుమంతుని రూపం చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇసుకలో నిలిచిన ఈ హనుమంతుడి ప్రతిమను దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగితేలారు.
రాజవొమ్మంగి మండలం జడ్డంగి వద్ద మడేరు వాగులో ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకొచ్చి ఒడ్డుకు చేరింది. వాగు నుంచి ఒడ్డుకు చేరి ఇసుకలో నిలబడి ఉన్న స్వామి విగ్రహాన్ని చూసిన స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. హనుమంతుడి విగ్రహాన్ని చూసి భక్తి పారవశ్యంలో మునిగారు. పూజలు చేసిన అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని జడ్డంగి రామాలయానికి తరలించారు. మంచి ముహూర్తం చూసి గ్రామంలో విగ్రహ ప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు చేస్తామని గ్రామ పెద్దలు తెలిపారు.