ముంబయి నటి కేసులో ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదు: హోంమంత్రి అనిత - ANITHA ON MUMBAI ACTRESS CASE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2024, 9:15 PM IST
Home Minister Anitha Comments on YS Jagan: ముంబయి నటి కేసులో ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత ప్రకటించారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. విచారణ చురుగ్గా సాగుతోందని చెప్పారు. కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నామన్నారు. విచారణ తర్వాత కొంతమంది పోలీసులపై చర్యలు ఉంటాయని అన్నారు. కేసును సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. కౌంటరింగ్ సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్‌పై విజయవాడలో జరుగుతున్న రెండు రోజుల జాతీయస్థాయి సదస్సును ప్రారంభించిన సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడారు.
ప్రజ్వల ఎన్జీవో, యూఎస్ కాన్స్యులేట్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. పలు రాష్ట్రాల నుంచి జడ్జిలు, పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మానవ అక్రమరవాణా పెరుగుతోందని అనిత అన్నారు. సైబర్ నేరాలతో అధికంగా ఈ తరహా కేసులు నమోదవుతున్నాయని మంత్రి తెలిపారు. ఉద్యోగాలు, మ్యారేజ్ బ్యూరోల ముసుగులో ఆన్లైన్ ద్వారా మానవ అక్రమ రవాణా జరుగుతుందని మంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.