దేశంలో మూడోసారీ ప్రధాని మోదీనే - భువనగిరిలో గెలుపు నాదే! : బూర నర్సయ్య గౌడ్ - lok sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : Mar 31, 2024, 12:46 PM IST
BJP MP Candidate Boora Narsaiah Goud Meets Walkers : దేశంలో నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ జోస్యం చెప్పారు. ఈరోజు ఉదయం భువనగిరి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, చెరువు కట్ట వద్ద మార్నింగ్ వాకర్స్‌తో ఆయన మాట్లాడారు. తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని బూర నర్సయ్య గౌడ్ మార్నింగ్ వాకర్స్‌ను కోరారు. ఈ సందర్భంగా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు .
గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తన పార్లమెంట్ నియోజక వర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని వాకర్స్‌కు బూర నర్సయ్య గౌడ్ గుర్తు చేశారు. బీబీ నగర్ ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, పాస్‌పోర్ట్ కేంద్రం తాను ఎంపీగా ఉన్నప్పుడే తీసుకువచ్చినట్లు వాకర్స్‌కు వివరించారు. మరోసారి తనకు ఎంపీగా అవకాశం కల్పించాలని కోరారు. ఈ సారి తనను ఎంపీగా గెలిపిస్తే జిల్లాకు ఐటీ పరిశ్రమలు తీసుకువస్తానని తెలిపారు. రూ.20 వేల కోట్లతో మరిన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.