నిండుకుండలా భూపతిపాలెం జలాశయం - 3 గేట్లు ఎత్తి నీటి విడుదల - Bhupatipalem Reservoir - BHUPATIPALEM RESERVOIR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 6, 2024, 1:33 PM IST
Bhupatipalem Reservoir Gates Open in Alluri District : అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని భూపతిపాలెం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాల్లో కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మారేడుపల్లి ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు భూపతిపాలెం జలాశయంలోనికి వచ్చి చేరుతోంది.
ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భూపతిపాలెం జలాశయంలోని మూడు గేట్లు ఎత్తి సీతపల్లి వాగులోకి నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త ఉండాలని సూచనలు చేశారు. మరోవైపు భూపతిపాలెం జలాశయం వద్ద జలకళ సంతరించకోవడంతో అక్కడ పర్యాటకులు సందడి చేస్తున్నారు. నిండుకుండలా ఉన్న జలాశయంను వీక్షించడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. అక్కడి ప్రకృతి సోయగాలను చూసి మైమరచిపోతున్నారు.