బలహీన వర్గాలకు భవిష్యత్‌లో ఉపప్రణాళిక తెస్తాం : భట్టి విక్రమార్క - bc kula ganana in telangana
🎬 Watch Now: Feature Video
Published : Feb 16, 2024, 5:41 PM IST
Bhatti on BC Caste Census Resolution : బలహీనవర్గాల అభివృద్ధి కోసం భవిష్యత్‌లో ఉప ప్రణాళిక తీసుకువస్తామని డిప్యూటీ సీఎం, ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ కులగణన తీర్మానంపై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలహీన వర్గాలకు గత ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు మించి ఖర్చు చేయలేదన్నారు. బీసీ కులగణన(BC Caste Census) తీర్మానంపై విధివిధానాలు ఎన్నికల్లోపు రూపొందిస్తామన్నారు.
BC Caste Census in Telangana : ఇతర రాష్ట్రాల్లో కులగణనకు వచ్చిన లీగల్ ఇబ్బందుల దృష్ట్యా, మన రాష్ట్రంలో చేపట్టబోయే కులగణనకు మేధావులు, న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర జనాభాలో బీసీలు ఎంత శాతం ఉన్నారో ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రగతిశీల భావాలతో ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. బీసీ కులగణనను వీలైనంత త్వరగా చేపడుతామన్నారు. మరోవైపు కులగణన తీర్మానానికి ఏకగ్రీవంగా శాసన సభ ఆమోదం తెలిపింది.