అట్లూరులో ఎలుగుబంటి హల్చల్ - వ్యవసాయ పనులకు వెళ్లాలంటే జంకుతున్న కూలీలు - Bear Halchal - BEAR HALCHAL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 2:07 PM IST
Bear Halchal in YSR District : వైఎస్సార్ జిల్లాలో ఎలుగుబంటి హల్చల్ చేస్తోంది. గత వారం రోజులుగా అట్లూరులో ఎలుగుబంటి (bear) సంచరించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పొలాలు, ఇళ్ల మధ్య ఎలుగుబంటి సంచారంతో గ్రామస్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఎలుగుబంటి సంచారంతో ఇంటి బయట నిద్రించాలన్న, వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాలన్న ప్రజలు భయపడుతున్నారు. ఏ సమయంలో వచ్చి ఎవరిపై దాడి చేస్తుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
Atlur Village in YSR District : అట్లూరు సమీపంలోని నందిపల్లి, సిద్దుగారిపల్లి, కోన సముద్రం గ్రామాల్లో ఎలుగుబంటి సంచరించి పలువురిని గాయపరిచిదని స్థానికులు తెలిపారు. ఈ ఘటన మరవక మందే మళ్లీ ఎలుగుబంటి సంచారం అట్లూరు గ్రామ ప్రజలు భయాందోళనకు గురి చేస్తోంది. అటవీ శాఖ అధికారులు( Forest officers) వెంటనే చర్యలు తీసుకుని ఎలుగుబంటి బంధించి అడవిలో వదిలి పెట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. తమ ప్రాంతం వాసులను ఎలుగుబంటి నుంచి రక్షించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నారు.