ఎలుకలపాలవుతున్న బతుకమ్మ చీరలు - పంచాలంటున్న హనుమకొండ వాసులు
🎬 Watch Now: Feature Video
Published : Jan 28, 2024, 7:47 PM IST
Bathukamma Pending Sarees Distribution Issue in Hanamkonda : గతేడాది బతుకమ్మ పండగ సందర్భంగా చీరల పంపిణీ కోసం సిద్ధమవుతుండగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో చీరల పంపిణీ ఆగిపోయింది. ఫలితంగా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన చీరలు పంచకుండా ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఉండిపోయాయి. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులు ఉండగా ప్రతి వార్డుకు లబ్ధిదారులకు పంచేందుకు బతుకమ్మ చీరలు చేరాయి. కానీ పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. దీంతో పలు వార్డుల్లోనే ఉండిపోయిన చీరలను ఎలుకలు, పందికొక్కులు చేరి నాశనం చేస్తున్నాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త ప్రభుత్వం స్పందించి లబ్ధిదారులకు చీరలు అందే విధంగా చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా పలు రాష్ట్రాల్లో ఇలాంటి సందర్బాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు పంపిణీ చేశాయని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే మిగతా చీరలు పంపిణీ చేస్తామని పురపాలక కమిషనర్ చెబుతున్నారు.