విజయనగరంలో గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల నిరసన - బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 5:26 PM IST
Bank Employees Protest in Vizianagaram : అనుబంధ బ్యాంకుల ఆధిపత్యం లేకుండా ఎన్ఆర్బీఐ (NRB) (నేషనల్ రూరల్ బ్యాంకు ఆఫ్ ఇండియా) ఏర్పాటు చేయాలని విజయనగరంలో గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రధానమైన 8 డిమాండ్లతో దేశ వ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంక్‌లు ఒక రోజు సమ్మెను చేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 22వేల శాఖలు మూసివేసి ఉన్నాయని తెలిపారు. లక్ష మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో (Strike) పాల్గొన్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా 30 వేలకు పైగా పోస్టులు గ్రామీణ బ్యాంకులలో ఖాళీగా ఉన్నాయని వాటి భర్తీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు.
పని భారం పెరగడం వల్ల ఒత్తిడి ఎక్కువవుతోందని, ఇద్దరు చేయవలసిన పని ఒక్కరితో చేయిస్తున్నారని అవేదన చెందారు. ఎన్నో ఏళ్ల నుంచి బ్యాంక్‌ల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్దీకరించాలని 2022 సంత్సరంలోనే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా నాబార్డ్ (NABARD) , అనుబంధ బ్యాంకులు కాలయాపన చేస్తున్నాయని మండిపడ్డారు. సర్వీస్ రూల్స్ అనుగుణంగా గ్రాట్యూటీ చెల్లించాలన్నారు. తమ సమస్యలు పరిస్కరించక పొతే మార్చ్ 27, 28 తేదీల్లో దేశ వ్యాప్తంగా రెండు రోజులు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.