బల్కంపేట అమ్మవారికి గుడిలోనే పట్టుచీరలు సిద్ధం చేసిన పోచంపల్లి నేత కార్మికులు - Balkampet Yellamma Kalyanam - BALKAMPET YELLAMMA KALYANAM
🎬 Watch Now: Feature Video
Published : Jul 4, 2024, 5:57 PM IST
Balkampet Yellamma Kalyanam in Hyderabad : ప్రఖ్యాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కల్యాణ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఏటా ఆషాడమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈనెల 9న బల్కంపేటలో జరగనున్న ఎల్లమ్మ కల్యాణానికి అమ్మవారిని అలంకరించేందుకు పట్టు చీరలను యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన నేత కార్మికులు అత్యంత నియమ నిష్టలతో ఆలయ ప్రాంగణంలోనే నేస్తున్నారు.
Balkampet Yellamma Kalyanam Saree : తెలంగాణ రాష్ట్ర పద్మ శాలి సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రాయరాజ్ ఆధ్వర్యంలో మూడు సంవత్సరాలుగా ఈ పద్దతి కొనసాగిస్తున్నారు. 7 రంగులతో 4,800 పోగులతో ఈ చీరలను నేస్తున్నట్లు జయరాజ్ వెల్లడించారు. గత శుక్రవారం నుంచి చీరల నేత ప్రారంభించామని ఎదుర్కోళ్ల రోజు మూడు చీరలను ఆలయ అధికారులకు అందజేస్తామని తెలిపారు. చీరలను నేసేందుకు చెన్నం ఉపేందర్, ఈడెం వెంకటేశం, శ్రీనివాసులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.