LIVE అనంతపురం సప్తగిరి కూడలి వద్ద స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో బాలకృష్ణ- ప్రత్యక్ష ప్రసారం - Balakrishna in Saptagiri - BALAKRISHNA IN SAPTAGIRI

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 8:10 PM IST

Updated : Apr 14, 2024, 8:46 PM IST

Balakrishna Election Campaign in Saptagiri LIVE : టీడీపీ అధికారం చేపట్టాక ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో కృషి చేస్తుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.  అనంతపురం  సప్తగిరి కూడలిలో స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్రను బాలయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో రోడ్‌షోలో పాల్గొన్నారు. కూడలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లక్ష్మీనరసింహస్వామి తన ఇష్టదైవమని, దుష్ట శిక్షణకు వెలసిన స్వామి దర్శనంతో వైఎస్సార్సీపీ పాలన అంతానికి సైకిల్‌ రావాలి - స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి టీడీపీ ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వం మారితే ముస్లింలకు ఉన్న బీసీ-ఇ రిజర్వేషన్‌ రద్దు చేస్తారంటూ అధికార పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీతోనే ముస్లింలకు ఎంతో మంచి జరిగిందన్నారు.  ప్రస్తుతం అనంతపురం సప్తగిరి కూడలిలో  'స్వర్ణాంధ్ర సాధికార యాత్ర'లో నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష ప్రసారం మీకోసం
Last Updated : Apr 14, 2024, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.