రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకలు - Babu Jagjivan Ram Jayanti 2024 - BABU JAGJIVAN RAM JAYANTI 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 5, 2024, 1:09 PM IST
Babu Jagjivan Ram Birth Anniversary Celebrations 2024 : భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రాం 117వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని పలువురు నాయకులు కొనియాడారు. అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని వెల్లడించారు. జగ్జీవన్‌రాం జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతికై కృషి చేశారని తెలిపారు.
Babu Jagjivan Ram Jayanti 2024 : దేశ రక్షణ మంత్రిగా బాబూ జగ్జీవన్ రాం వేసిన బాటలు దేశాన్ని సురక్షితంగా ఉంచాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రాం జయంతి వేడుకల్లో భట్టి పాల్గొన్నారు. ఆయన జీవితమంతా దేశం కోసం త్యాగం చేసి, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పార్‌టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతో పాటు పలువురు హాజరయ్యారు.