పొత్తులతో పార్టీలో ఇబ్బందులు సహజం - రాష్ట్రం కోసం రాజీపడక తప్పదు: అయ్యన్నపాత్రుడు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 10:40 PM IST
Ayyannapatudu met Vasantha Nageswara Rao: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుని తెలుగుదేశం నాయకులు అయ్యన్నపాత్రుడు, పీలా గోవింద్ పరామర్శించారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ పరిణామని అయ్యన్నపాత్రుడు అన్నారు. తెలుగుదేశం- జనసేన పొత్తుల వల్ల కొంత మందికి చిన్న చిన్న ఇబ్బందులు సహజమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొంత మేర రాజీపడక తప్పదని అన్ని ఒడుదుడుకులని దాటి ముందుకు సాగాలని అన్నారు. చిన్న చిన్న విషయాలకు పోయి తగాదాలు, గిల్లి కజ్జాలు పెట్టుకోకూడదని సూచించారు. రాక్షస పాలన అంతమొందించేలా ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ హయాంలో తాను వసంత నాగేశ్వరరావు మంత్రులుగా చేశాం, తమదంతా ఓ కుటుంబమని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలన కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే కృష్ణ ప్రసాద్ తెలుగుదేశంలో చేరుతున్నారని తెలిపారు.