LIVE : రాజ్‌భవన్‌లో శ్రీరామ పూజ కార్యక్రమం - ప్రత్యక్షప్రసారం - Sri Rama Puja Raj Bhavan live
🎬 Watch Now: Feature Video
Published : Jan 22, 2024, 10:23 AM IST
|Updated : Jan 22, 2024, 11:56 AM IST
Sri Rama Puja Live : అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో మరికొన్ని గంటల్లో శ్రీరాముడు కొలువుదీరనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ అమృత ఘడియల కోసం దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. అభిజిల్లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. అయోధ్య నగరం మొత్తాన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడేలా తయారు చేశారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనను పురస్కరించుకుని రాష్ట్రంలో పలు చోట్ల భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ రాజ్‌భవన్‌లో శ్రీరామ పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరాముడి సంకీర్తనలు చేస్తున్నారు.