పోలీసులతో అవంతి శ్రీనివాసరావు వాగ్వాదం - పోలింగ్​ కేంద్రంలోకి అనుచరులను అనుమతించలేదని ఆగ్రహం - YCP Leader Argument With Police - YCP LEADER ARGUMENT WITH POLICE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 4:27 PM IST

Avanthi Srinivasarao Argument With Police in Polling Center: విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మధురవాడ చంద్రంపాలెంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఏఆర్‌ సీఐతో వాదులాడారు. చంద్రంపాలెంలోని పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ కేంద్రానికి శ్రీనివాసరావు తన అనుచరులతో లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తనతోపాటు సిబ్బందిని పోలింగ్‌ కేంద్రంలోకి పంపలేదన్న కారణంతో సీఐ విద్యాసాగర్‌తో శ్రీనివాసరావు దురుసుగా మాట్లాడారు.

అభ్యర్థిని తప్ప మిగతా వారిని లోపలికి అనుమతించకూడదని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా గేటు వద్దనున్న సీఐ​తో వాదనకు దిగారు. సీఐ కూడా అవంతికి ధీటుగా బదులిచ్చారు. అయినా పోలీసులు వారిని పోలింగ్​ కేంద్రం లోపలికి పంపించలేదు. దీంతో వారిపై ఆగ్రహించిన అవంతి చేసిందేమీ లేక అక్కడి నుంచి వెనుదిరిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్​ కేంద్రాల వద్ద అభ్యర్థుల అనుచరులను ఎక్కువ మందిని అనుమతించబోమని స్పష్టం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.