ఐడియా అదిరింది గురూ - హాట్ సమ్మర్లో హబీబ్ భాయ్ ఆటోలో కూల్ కూల్ జర్నీ - FREE DRINKING WATER IN AUTO - FREE DRINKING WATER IN AUTO
🎬 Watch Now: Feature Video
Published : May 22, 2024, 2:30 PM IST
Man Providing Free drinking water in Auto : గతంలో ఎదురైన అనుభవం, ఈ ఏడాది కాసిన తీవ్రమైన ఎండలు ఆ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచనకు కారణమయ్యాయి. హైదరాబాద్‌లోని ఆటోవాలాలకు కొత్త పోకడ అలవాటు చేయాలని, ప్రయాణికుల అలసట తీర్చాలని ఆ పెద్దాయన చేసిన ఆలోచన అందర్నీ ఆలోచింపజేస్తోంది. సాటి వారికి తోచిన సాయం చేయడంలోనే మనిషికి సంతృప్తి దొరుకుతుందనేది ఆ ఆటో డ్రైవర్ మాట.
మిత్రుడి సాయంతో ఆటోకే ఓ సెటప్ ఏర్పాటు చేసి, కూర్చునేందుకు వసతి, ఎండ తగలకుండా ప్రత్యేక రూఫ్ సిస్టమ్, తాగడానికి డ్రింకింగ్ వాటర్ వసతి కల్పించారు. అలా హబీబ్ భాయ్ ఆటో ఎక్కే ప్రయాణికులు మండుటెండలో కూల్ కూల్‌గా ప్రయాణిస్తూ చల్లటి నీళ్లు తాగుతూ హాయిగా ప్రయాణిస్తున్నారు. హబీబ్ భాయ్ వినూత్న ప్రయతంపై ప్రయాణికులతో పాటు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పక్కన ఎవరైనా చావుబతుకుల్లో ఉన్నా కనీసం పట్టించుకోనే నేటి పరిస్థితుల్లో ప్రయాణికుల కోసం ఆలోచించి, వారు ఎండలో ఇబ్బంది పడకూడదని ఈ ఆటోవాలా చేసిన ప్రయత్నాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. మరి హబీబ్ భాయ్‌కి ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి.