ధర్మాన వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం - సాక్ష్యాధారాలతో ఈసీకి లేఖ - TDP leader Atchannaidu
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 7:55 PM IST
Atchannaidu Writes Letter to CEC : కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం లేఖ రాసారు. లేఖలో అన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రస్తావించారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు చేశారని తెలిపారు. అయినప్పటికి ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార వైఎస్సార్సీపీ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
Atchannaidu Complaint on Volunteers : వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయాలని స్వయంగా మంత్రులే బహిరంగంగా చెబుతున్నారని మండిపడ్డారు. వృద్దులు, వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులో వాలంటీర్ల ప్రమేయం లేకుండా సీఈవో, డీఈవో, ఆర్వోలకు ఎన్నికల కమిషన్ వెంటనే ఆదేశాలివ్వాలని కోరారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అదేవిధంగా మంత్రులే ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనాలన్న ధర్మాన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేెశారు.