బస్సు దిగే విషయంలో గొడవ, లేడీ కండక్టర్, ప్రయాణికురాలి మధ్య వాగ్వాదం - వీడియో వైరల్ - Conductor Slaps Female Passenger - CONDUCTOR SLAPS FEMALE PASSENGER
🎬 Watch Now: Feature Video
Published : Jul 16, 2024, 10:19 PM IST
Conductor Slaps Female Passenger in RTC Bus : ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలు, మహిళా కండక్టర్ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై ప్రయాణికురాలు ఆర్టీసీ మేనేజర్‌కు రాసిన లెటర్ స్థానిక వాట్సాప్ గ్రూప్‌లో వైరల్ అయ్యాయి.
వలిగొండ మండలం పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన ఉదయ భాను ఈ నెల 14న భువనగిరి నుంచి నల్లగొండ రూట్‌లో వెళ్తోంది. స్టాప్‌లో బస్సు దిగే సమయంలో త్వరగా దిగాలని తొందరపెట్టడంతో వివాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలోనే మహిళా కండక్టర్ తనపై భౌతిక దాడి చేసిందని ప్రయాణికురాలు ఆరోపించింది. ఈ విషయంపై కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఉదయ భాను ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేసింది. కాగా ప్రయాణికురాలు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని, తన విధులకు ఆటంకాలు సృష్టించిందని మహిళా కండక్టర్ ఆరోపించారు.