'ఛాయ్, సిగరెట్ తెమ్మంటున్నారు'- ఇన్చార్జి తహసీల్దార్‌పై వీఆర్ఏల ఆరోపణ 'వీడియో వైరల్' - తహసీల్దార్ వీఆర్ఏల మధ్య వాగ్వాదం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 12:31 PM IST
|Updated : Feb 4, 2024, 1:09 PM IST
Argument between Incharge Tahsildar and VRAs: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం (Tahsildar Office in Dharmavaram) లో ఇంఛార్జ్ తహసీల్దార్ ఈశ్వరయ్య, వీఆర్ఏల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
వీఆర్ఏలు తెలిపిన వివరాల ప్రకారం: తహసీల్దార్ ఈశ్వరయ్య వీఆర్ఏలను అసభ్య పదజాలంతో దూషించారు. భోజనం వడ్డించేందుకు వీఆర్ఏలు రావడంలేదని అంతు చూస్తానంటూ వారిని (Incharge Tahsildar Threats to VRAs) బెదిరించారు. దీంతో వీఆర్ఏ సంఘం నాయకుడు రామకృష్ణ ఆధ్వర్యంలో వీఆర్ఏలు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఇంఛార్జ్ తహసీల్దార్ ఈశ్వరయ్య (Incharge Tahsildar Iswaraiah) తో వాగ్వాదానికి దిగారు. టీ, భోజనం, సిగరెట్లు తేవాలని వేధిస్తూ తమను బానిసల్లా చూస్తున్నారని వీఆర్ఏలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను కొందరు ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు (District Revenue Officers) స్పందించి ఈ ఘటనపై విచారణ చేపట్టారు.