ప్రమాదకరంగా అరకులోయ ఘాట్ రోడ్డు- విరిగి పడుతున్న కొండచరియలు - ARAKU VALLEY GHAT ROAD DAMAGED - ARAKU VALLEY GHAT ROAD DAMAGED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 5, 2024, 7:48 PM IST
Araku Valley Ghat Road has Very Damaged due to Heavy Rains : నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా తడిసి ముద్దయింది. అరకులోయ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. రోడ్డు మార్గం ఛిద్రమై రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఎక్కడబడితే అక్కడ మట్టి పెళ్లలు, కొండచరియలు విరిగి రహదారిపై పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. భారీగా కురుస్తున్న వర్షానికి గాలికొండ ప్రాంతంలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. రహదారిపై ఐదు అడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తుంది.
దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ముందస్తు సమాచారం లేకపోవడంతో ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం పొంచి ఉంది. మరోవైపు రహదారి నిర్వహణ చూడాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.