15 ఏళ్లుగా మహిళతో ఏఆర్ ఎస్సై సహజీవనం - వదిలించుకునేందుకు బెదిరింపులు - AR SI News in Anantapur

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 5:59 PM IST

AR SI Cheated The Woman in Anantapur District : అతడు చేసేది పోలీస్‌ ఉద్యోగం. ఎవరైనా తప్పు చేస్తే వారికి బుద్ధి చెప్పడం అతడి పని. కానీ అతడే తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. 15 ఏళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేసి చివరికి ఈ వ్యవహారం తన ఇంట్లో భార్య, పిల్లలకు తెలిసిందనే కారణంతో ఏఆర్ ఎస్సై  మొహం చాటేసిన ఘటన అనంతపురంలో జరిగింది. దీంతో బాధిత మహిళ అంజలి తన కొడుకు, కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా అంజలి మీడియాతో మాట్లాడుతూ, 16 ఏళ్ల కిందట తన భర్త ఇమామ్ సాబ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏఆర్ ఎస్సై చంద్రశేఖర్ పరిచయం అయ్యాడని తెలిపింది.

తన భర్త  పీటీసీకి శిక్షణ కోసం వెళ్లినప్పుడు అందులో ఫెయిల్ చేస్తానని బెదిరించి 2008లో తనను లొంగదీసుకున్నాడని బాధితురాలు వాపోయింది. అప్పటి నుంటి ఇప్పటి వరకు 15 ఏళ్లుగా చంద్రశేఖర్​తో సహజీవనం చేశానని అంజలి వివరించింది. అయితే ఈ విషయం చంద్రశేఖర్ కుటుంబసభ్యులకు తెలిసింది. అప్పటి నుంచి తనను దూరం పెడుతూ వచ్చాడని, చివరికి నీదారి నువ్వు చూసుకోవాలని బెదిరించాడని వాపోయింది. లేకపోతే తన భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి చంపినట్లే నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపింది. దీనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడింది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని అంజలి కోరుతుంది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.