ఫ్లాట్ ఫామ్‌పైకి దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు - తప్పిన పెను ప్రమాదం - RTC bus rams into platform - RTC BUS RAMS INTO PLATFORM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 1:42 PM IST
APSRTC Bus Overshot the Platform: అనంతపురం జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం బస్సు డిపో నుంచి హిందూపురం ఆర్టీసీ బస్సు బయటకు వచ్చింది. బస్సు డ్రైవర్ ఆ బస్సును ఫ్లాట్ ఫామ్‌పైకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, బస్సు మాత్రం ఒక్కసారిగా ఫ్లాట్ ఫామ్ మీదకు వేగంగా దూసుకొచ్చింది. ఆర్టీసీ బస్సు ఫ్లాట్ ఫామ్ మీదకు వచ్చిన సమయంలో, అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. డ్రైవర్ నిర్లక్ష్యం (RTC Driver negligence) వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్‌ను నొక్కడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదంపై (Bus accident) ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడతామని తెలిపారు. బస్సులో తలెత్తిన సాంకేతిక లోపమా, లేదా డ్రైవర్ నిర్లక్ష్యమా అనేది విచారణలో తేలుతుందని పేర్కొన్నారు.