LIVE : రావులపాలెంలో APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రెస్మీట్ - ప్రత్యక్షప్రసారం - APCC Chief Sharmila Pressmeet - APCC CHIEF SHARMILA PRESSMEET
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 30, 2024, 10:38 AM IST
|Updated : Apr 30, 2024, 10:48 AM IST
APCC Chief Sharmila Pressmeet From Ravulapalem Live : APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి రావులపాలెంలో మీడియాతో మాట్లాడారు. న్యాయ్ యాత్రలో భాగంగా సోమవారం ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో షర్మిల రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయని ప్రత్యేక హోదా ఇవ్వని భాజపాతో తెలుగుదేశం, వైసీపీ ప్రేమాయణం సాగిస్తున్నాయని మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులను జగన్ నమ్మించి నిండా ముంచారని షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం బాధితులకు పరిహారం ఇవ్వకుండా మొండి చేయి చూపించారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా , పోలవరం ప్రాజెక్టుకు బీజేపీ సహకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రతి ఒకరూ ఆలోచించి ఓటేయాలని షర్మిల పిలుపునిచ్చారు. రైతులను అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని షర్మిల మండిపడ్డారు. ఇప్పటికీ 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయని అన్నారు. ఐదేళ్లు పాలించిన జగన్ గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా అని విమర్శించారు. జగన్ మద్యపానం నిషేధం చేయకపోగా నాసిరకం మద్యం అమ్మారని ఆరోపించారు. ప్రభుత్వం అమ్మిన బ్రాండ్ మద్యమే కొనాలని ఈ నాసిరకం మద్యంతో 25 శాతం మంది చనిపోతున్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల పేర్కొన్నారు. రావులపాలెం షర్మిల మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.
Last Updated : Apr 30, 2024, 10:48 AM IST