ఉపాధి, ఉద్యోగ అవకాలు కల్పించే సమర్ధులను ఎన్నుకుంటాం: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు - SOFTWARE EMPLOYEES ON POLLING
🎬 Watch Now: Feature Video
AP Software Employees in Hyderabad Ready to Vote : ఏపీ మే 13న జరగబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వారికే ఓటు వేస్తామని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తేల్చి చెప్పారు. అయిదేళ్లకు ఒకసారి జరిగే రాజ్యాంగ పండగకు సొంతూళ్లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉవ్విళ్లూరుతున్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాలు కల్పించే సమర్థత ఉన్న ప్రభుత్వాన్నే ఎన్నుకుంటామని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు చెబుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడికి పట్టం కడుతామని సృష్టం చేశారు
సరైన అవకాశాలు లేకపోవడం వల్లే హైదరాబాద్‌కు వలస వచ్చామని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సమర్థుడైన నేత అవసరమని అందుకోసం హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లి ఓటు హక్కు వినియోగించేందుకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. రాబోయే తరాల బంగారు భవిష్యత్తు, అభ్యున్నతి కోసం తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కంకణం కట్టుకున్నారు. ఆంధ్రాలోనూ ఐటీ రంగం అభివృద్ధి చెందాలని కాంక్షిస్తున్నామంటున్న యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో ముఖాముఖి.