Live: ఇడుపులపాయలో వైఎస్ షర్మిల మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - ys sharmila
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 20, 2024, 6:50 PM IST
|Updated : Jan 20, 2024, 6:56 PM IST
YS Sharmila Live: ఇడుపులపాయలో వైఎస్ షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్న షర్మిలకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కడప నుంచి ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌కు షర్మిల చేరుకున్నారు.
కాగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ పీసీసీ నూతన అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఆదివారం బాధ్యతలు తీసుకోనున్నారు. 21 తేదీ ఉదయం 11 గంటలకు ఆంధ్రరత్న భవన్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి మయప్పన్, మాజీ కేంద్ర మంత్రులు ఇతర సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌కు షర్మిల చేరుకున్నారు. ఈ నెల 16 తేదీన ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇడుపులపాయలో వైఎస్ షర్మిల మీడియా సమావేశం ఇడుపులపాయలో వైఎస్ షర్మిల మీడియా సమావేశం మీ కోసం.