రుషికొండ నిర్మాణాలపై హైకోర్టుకు నిపుణుల కమిటీ నివేదిక - తదుపరి విచారణ వాయిదా - రుషికొండపై నిర్మాణాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 4:57 PM IST
AP High Court Hearing on Rushikonda: విశాఖ రుషికొండపై అక్రమ తవ్వకాలు, నిర్మాణాలు, గ్రావెల్ తరలింపుపై జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ గౌరప్పాన్ ఛైర్మన్గా ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీని గత విచారణలో ఏర్పాటు చేసింది. రుషికొండను పరిశీలించాలని హైకోర్టు ఈ కమిటీని హైకోర్టు ఆదేశించగా, హై కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది డిసెంబర్ 17 రుషికొండను నిపుణుల కమిటీ పరిశీలించింది.
కొండ మీద అక్రమ తవ్వకాలు, నిర్మాణాలు ఉల్లంఘనల తీవ్రతను కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖకు గౌరప్పాన్ బృందం నివేదిక సమర్పించింది. గత నెల 22న ఆకస్మికంగా గౌరప్పాన్ మృతి చెందడంతో నిర్ణయం ఆలస్యమైందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు నిపుణులు కమిటీ ఇచ్చిన నివేదికపై నిర్ణయం కోర్టుకు సమర్పించేందుకు మూడు వారాలు సమయం కోరారు. తదుపరి విచారణ మూడు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది.