స్థానిక సంస్థలకు మోక్షం- 14 వందల 52 కోట్ల నిధుల విడుదల - AP Government Released Funds - AP GOVERNMENT RELEASED FUNDS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 20, 2024, 5:50 PM IST
AP Government Released Funds to Local Organizations : స్థానిక సంస్థలకు 14 వందల 52 కోట్ల రూపాయల నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో పక్కదారి పట్టించిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది. గ్రామాల్లోని స్థానిక సంస్థలకు 998 కోట్లు, పట్టణాల్లోని స్థానిక సంస్థలకు 454 కోట్లు పంపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, వాటిని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ఈ నిధులతో గ్రామ, వార్డు స్థాయిల్లో పనులు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు పయ్యావుల చెప్పారు.
గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర, దేశ అభివృద్ధని మహాత్మాగాంధీ ఆశయాలను పాటించే ప్రభుత్వం తమదని అన్నారు. స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిధులతో గ్రామ, వార్డు స్థాయిల్లో పనులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని పేర్కొన్నారు.