ఏపీలో ఉచిత ఇసుక ఎఫెక్ట్ - యానాంలో ఊపందుకున్న వెంకన్న ఆలయ నిర్మాణం - AP Free Sand Policy Effect

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 5:28 PM IST

thumbnail
ఏపీలో ఉచిత ఇసుక ఎఫెక్ట్ - యానాంలో ఊపందుకున్న ఆలయ నిర్మాణం (ETV Bharat)

AP Free Sand Policy Effect: కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రాచీనమైన భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం పునర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మీసాల వెంకన్న, సద్దికూడు వెంకన్నగా భక్తులు పిలుచుకునే వేంకటేశ్వర స్వామి సుమారు 600 ఏళ్లుగా పూజలు అందుకుంటున్నాడు. నాలుగేళ్ల క్రితం భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం పునర్ నిర్మించాలని ఆలయ కమిటీ భావించారు. 

తీరా పనులు ప్రారంభించే సమయానికి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో ఇసుక పాలసీ విధానం మారడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తేవడంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వేంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి భక్తులు మూడు కోట్ల రూపాయలు విరాళాలుగా అందించగా, తిరుమల తిరుపతి దేవస్థానం మరో మూడు కోట్లు సమకూర్చింది. ఆరు కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మాణం పనులు చేపట్టింది. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.