ఓటర్లకు తాయిలాలు - జగన్ బొమ్మతో నిత్యావసరాలు అందజేత - ఓటర్లకు తాయిలాలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 8:59 PM IST
AP Food Commission Member Distributing Gifts to People : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడే కొద్ది అధికార వైఎస్సార్సీపీ నాయకులు ఓటర్లకు తాయిలాలు ఎరగా వేస్తున్నారు. అభినంద సభలు, ఆత్మీయ సమావేశాలంటూ వివిధ వర్గాలను ఆహ్వానిస్తూ మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంట్, షర్టు బాక్సులు, నిత్యవసర సరుకులు చేతిలో పెడుతున్నారు. తాజాగా రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు యాదవ్ విజయనగరంలో కె.ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో తాయిలాలు పంపిణీ చేశారు. ఇప్పటికే ఇంటర్ విద్యార్ధులకు జగన్ బొమ్మతో కూడిన ప్యాడ్, బాక్సులను పంపిణీ చేసిన ఈయన పేదలు, వృద్ధులకు విరివిగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు.
తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 600 మందికి బియ్యం అందజేశారు. వెనకబడిన వర్గానికి చెందిన తనకు సీఎం జగన్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడిగా అవకాశం కల్పించారని కాంతారావు యాదవ్ అన్నారు. రానున్న రోజుల్లో పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే మరోసారి జగన్ కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.