శనివారం తిరుమలకు జగన్​ - రాష్ట్రవ్యాప్తంగా పూజలకు వైఎస్సార్సీపీ పిలుపు - Jagan Tweet On Tirumala Laddu Issue

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 7:44 PM IST

EX CM YS Jagan Tweet On Tirumala Tirupati Laddu Controversy : తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని జగన్​ అన్నారు. ఇందుకు నిరసనగా వైఎస్సార్సీపీ పూజా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ఈ నెల 28న పూజల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్​లో పోస్ట్ పెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని ఆరోపించారు. కావాలని అబద్ధాలాడి, కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనికి నిరసనగా పూజా కార్యక్రమాలు చేయాలని పార్టీ నేతలకు జగన్​ సూచించారు. తిరుమల పవిత్రతను, స్వామి వారి ప్రసాదం విశిష్టతను, వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగిందని చెప్పడం తగదని ధ్వజమెత్తారు. అందులో భాగంగా ఈ నెల జగన్​ 27న తిరుమలకు వెళ్లనున్నారు. శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుని శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.