గంజాయి నిర్మూలనపై స్పెషల్ ఫోకస్- త్వరలో పోలీసుల నియామకాలు, కొత్త వాహనాలు: డీజీపీ - DGP REVIEW MEETING - DGP REVIEW MEETING
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-07-2024/640-480-21946499-thumbnail-16x9-ap-dgp-dwaraka-tirumala-rao-review-meeting.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 8:14 AM IST
AP DGP Dwaraka Tirumala Rao Review Meeting With SPs : గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఆయన తిరుపతికి వచ్చి స్థానిక పోలీసు అతిథి గృహం కాన్ఫరెన్స్ హాల్లో అనంతపురం, కర్నూలు రేంజ్ జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతపురం, కర్నూల్ రేంజ్లో నేరాల అదుపు, శాంతి భద్రతలను కాపాడే విధానం, స్థానిక సమస్యలపై అధికారులతో కూలంకషంగా చర్చించారు.
Dwaraka Tirumala Rao on Ganja in AP : కొంతకాలంగా జిల్లాల్లో ఉన్న సవాళ్లపై ద్వారకా తిరుమలరావు చర్చించారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి అవసరమైన కొన్ని వనరులు సరిగా లేవని అన్నారు. ముఖ్యంగా వాహనాలు పాతబడ్డాయని, త్వరలో వాహనాలు సమకూరుస్తామని తెలిపారు. త్వరలో పోలీసుల నియామకాలు చేస్తామని, కొంత సమయం పడుతుందని అన్నారు. ప్రస్తుతం గంజాయిపై 100 రోజులు ప్రణాళిక రూపొందించామని డీజీపీ చెప్పారు. మాదక ద్రవ్యాలపై ప్రజలకు, యువతకు, చిన్నపిల్లలకు కూడా అవగాహన కల్పించాలని ఆదేశించారు. బాలికలపై అత్యాచారాలను అరికట్టేందుకు శ్రద్ధ పెట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. కొత్త చట్టాల గురించి అన్ని పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమాలు జరిగయని తెలిపారు.