LIVE హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు- ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు.. ప్రత్యక్ష ప్రసారం - Chandrababu rally in Hyderabad - CHANDRABABU RALLY IN HYDERABAD
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 5, 2024, 7:24 PM IST
|Updated : Jul 5, 2024, 8:06 PM IST
CM Chandrababu rally in Hyderabad: దిల్లీ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజులు పాటు దిల్లీ బిజీబిజీగా గడిపిన చంద్రబాబు.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆమెకు నివేదించి ఏపీకి అండగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. అంతకుముందే నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో సీఎం భేటీ అయ్యారు. ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యేందుకు హైదరాబాద్‌కు చంద్రబాబు చేరుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు శనివారం ఇద్దరు సీఎంలు భేటీ కానున్నారు. దీంతో దిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా బేగంపేటకు చేరుకున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు తెలంగాణ టీడీపీ ఇప్పటికే ర్యాలీకి అనుమతి కోరింది. బేగంపేట నుంచి చంద్రబాబు నివాసం వరకు ర్యాలీకి ప్రణాళిక వేశారు. తెలంగాణ టీడీపీ కార్యకర్తల ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. 300 మందికి మించి ర్యాలీలో పాల్గొనవద్దని సూచించారు. తెలంగాణలో చంద్రబాబు ర్యాలీ ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jul 5, 2024, 8:06 PM IST