ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మహిళాలకు వ్యాపార మెళకువలు - AP Chambers Women Entrepreneurs - AP CHAMBERS WOMEN ENTREPRENEURS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 2, 2024, 6:37 PM IST
AP Chambers Women Entrepreneurs: ఆధునిక ప్రపంచంలో మగవారికి దీటుగా మహిళలు అన్నిరంగాలతో పాటు వ్యాపార రంగంలోనూ అద్భుతంగా రాణిస్తున్నారని విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య అన్నారు. ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్వంలో గుంటూరులో ఏర్పాటు చేసిన మహిళా విభాగపు వాణిజ్య శాఖను ఆయన ప్రారంభించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నైపుణ్యాలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఒక వేదికను అందుబాటులోకి తీసుకురావడం పట్ల ఔత్సాహిక వ్యాపారవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.
"ఆధునిక ప్రపంచంలో మగవారికి దీటుగా మహిళలు అన్ని రంగాలతో పాటు వ్యాపార రంగంలోనూ మరింత అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా వ్యాపారులను మరింత ప్రోత్సహించేందుకు ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్వంలో గుంటూరులో మహిళా విభాగపు వాణిజ్య శాఖను ఏర్పాటు చేశాం. ఇక్కడ ఔత్సాహిక మహిళా వ్యాపారులకు అవసరమైన నైపుణ్యాలు, సలహాలు, సూచనలతో శిక్షణను అందించి వ్యాపార రంగంలో వారు ముందుకు వెళ్లేందుకు తోడ్పాటును అందిస్తాం." - లావు రత్తయ్య, విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్