భక్తుడి కానుక - అన్నవరం దేవాలయ ధ్వజస్తంభం స్వర్ణమయం - Annavaram Dwajasthambam Gold Coated - ANNAVARAM DWAJASTHAMBAM GOLD COATED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 9, 2024, 12:51 PM IST
Annavaram Temple News : కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం స్వర్ణమయమైంది. అవినేటి మండపంలో స్వర్ణ తాపడంతో తయారు చేసిన కవచాన్ని ధ్వజస్తంభానికి అమర్చారు. నెల్లూరుకు చెందిన దాత సహకారం వల్ల రూ. 2 కోట్ల వ్యయం గల బంగారు తాపడంతో నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు నుంచి తీసుకువచ్చిన నారేప కర్రతో సుమూరు 60 అడుగుల ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. 300 కేజీల రాగిపై 18 వందల గ్రాముల బంగారు తాపడం చేశారు.
స్తంభానికి అమర్చిన స్వర్ణ రేకుపై అష్టలక్ష్మిలు, దశావతారాలు, పంచాయతనాలతో దైవత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ధ్వజ స్తంభానికి వైదిక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సంప్రోక్షణ అనంతరం ధ్వజ స్తంభం ప్రదిక్షిణకు భక్తులను అనుమతించారు. భారీగా ఆలయానికి వచ్చిన భక్తులు దైవపారాయణ చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. గతంలో కూడా ఓ భక్తుడు 2 కోట్లతో బంగారంతో తాపడం చేయించిన సంగతి తెలిసిందే.