ఈనెల 24న ఏపీ కేబినెట్ సమావేశం - హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ - AP Cabinet Meet on June 24th - AP CABINET MEET ON JUNE 24TH
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 22, 2024, 5:39 PM IST
Cabinet Meeting June 24th in AP : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ నెల 24వ తేదీన సచివాలయంలో ఉదయం 10:00 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై మంత్రిమండలిలో కీలక చర్చ జరుగనుంది.
AP New Cabinet Meet 2024 : మొత్తం ఎనిమిది శాఖలపై శ్వేత పత్రాల విడుదలపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేక ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పులపై ప్రాథమిక సమాచారాన్ని కొత్త ప్రభుత్వం తెప్పించుకుంది. రూ.14 లక్షల కోట్లపైగా ఏపీకి అప్పుల భారం ఉందని సర్కార్‌కు సమాచారం వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపై మంత్రిమండలిలో కీలక ప్రస్తావన చేసే అవకాశం ఉంది.