అనంతపురం పోలీస్ల రికార్డ్ - 3.45 కోట్ల విలువైన సెల్ ఫోన్ల రికవరీ - POLICE RECOVERY OF MOBILES
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 29, 2024, 4:43 PM IST
Phone Recovery Mela in Anantapur Police Parade Maidan : అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో ఫోన్ రికవరీ మేళా జాతరలా సాగింది. సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితులంతా క్యూకట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో 10వేల మందికి సంబంధించిన 18.5 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్లను రికవరీ చేసి ఇచ్చామని పోలీసులు తెలిపారు. తాజాగా 3.45 కోట్ల విలువైన సెల్ ఫోన్లను 1309 మంది బాధితులకు రికవరీ చేసి అందచేస్తున్నామన్నారు. ఫోన్లు రికవరీ చేసిన సిబ్బందిని ఎస్పీ జగదీష్ ప్రశంసించడంతోపాటు రివార్డులు ఇచ్చారు.
సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 10 వేల మందికి తిరిగి వారి పోన్లు రికవరీ చేసి ఇచ్చామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పారు. ఫోన్లు పోగొట్టుకున్న వారికి అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో పంపిణీ చేసే కార్యక్రమం జాతరలా జరిగింది. జిల్లాలో రికార్డు స్థాయిలో సెల్ ఫోన్లు రికవరీ చేసి, బాధితులకు అందించామని ఎస్పీ తెలిపారు. ఫోన్ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్ తీసుకోవాలని ఆయన సూచించారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్నా, దొంగతనం జరిగినా జిల్లా పోలీసులను సంప్రదించాలని చెప్పారు.