మెుక్కు తీర్చుకుంటున్న అమరావతి రైతులు- తిరుపతికి పాదయాత్ర - Capital Farmers padayatra - CAPITAL FARMERS PADAYATRA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 13, 2024, 2:47 PM IST
Amaravati Farmers Padayatra to Tirupati : ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం, అమరావతిలో పనులు ప్రారంభం కావడంతో రాజధాని రైతులు తిరుపతికి పాదయాత్ర చేపట్టారు. చంద్రబాబు సీఎం కావాలని, రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉండాలంటూ గతంలో వెలగపూడికి చెందిన కొంతమంది రైతులు తిరుపతికి పాదయాత్రగా వస్తామని మొక్కుకున్నారు. ఈ రెండు కోరికలు నెరవేరడంతో రైతులు మొక్కులు చెల్లించేందుకు గురువారం తిరుపతికి బయలుదేరారు.
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధించి సీఎంగా చంద్రబాబు నాయుడు రావడం సంతోషంగా ఉందని అమరావతి రైతులు పేర్కొన్నారు. ఆయన సీఎంగా పదవి బాధ్యతలు తీసుకున్న తక్షణమే అమరావతిలో రాజధాని పనులు ప్రారంభం కావడంతో శ్రీవారి మొక్కులు చెల్లించడానికి బయల్దేరామని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి అమరావతి రాజధాని ఏర్పాడి అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో పాదయాత్రలో పాల్గొనే రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని జేఏసీ కమిటీ సభ్యులు పువ్వాడ సుధాకర్ పాదయాత్రను ప్రారంభించారు.