సంబరాల్లో మునిగి తేలిన అమరావతి రైతులు - టపాసులు పేల్చూతూ ఆనందోత్సవాలు - Amaravathi Farmers Celebrations
🎬 Watch Now: Feature Video
Amaravathi Farmers Celebrations: రాష్ట్రంలో కూటమి విజయం సాధించటంతో అభిమానులు, పార్టీ కార్యకర్తల ఆనందానికి అవధులు లేవు. అన్ని ప్రాంతాల్లో బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కూటమి విజయంపై అమరావతి రైతులు స్వీట్లు తినిపించుకుంటూ విజయోత్సాహంలో మునిగి తేలారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో రైతులు, మహిళలు సంబరాలు చేశారు. నృత్యాలు చేస్తూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
ఈరోజుతో రాష్ట్రంలో అరాచకపాలన అంతం అయిందని ఫ్యానును నేలకేసి కొట్టారు. బైకులకు ఫ్యానును కట్టేసి ఈడ్చుకెళ్తూ టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. జై తెలుగుదేశం, జై జనసేన అంటూ నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు సీఎం అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో "వైస్సార్సీపీ అంతం - రాజధాని రైతుల పంతం" నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి రాష్ట్ర ప్రజలు మద్దతు పలికి జగన్ అరాచక పాలనకు ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. తమను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన వైఎస్సార్సీపీ పీడ ఇవాళ్టితో అంతం అయిందంటూ భావోద్వేగానికి గురయ్యారు.