టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించాలి - సీఈవోకి కూటమి నేతల ఫిర్యాదు - Complaint on TTD EO Dharma Reddy - COMPLAINT ON TTD EO DHARMA REDDY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 7:45 PM IST
Alliance Leaders Complaint on TTD EO Dharma Reddy: ముఖ్యమంత్రి జగన్ కోసం డబ్బు సేకరిస్తున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని అక్కడి నుంచి తప్పించాలని కోరుతూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు సీఈవోకి ఫిర్యాదు చేశారు. తిరుమలలో రాజకీయ ప్రచార కార్యక్రమాలు, అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేతలు సీఈఓకి విన్నవించారు. కోడ్ అమల్లోకి వచ్చినా అధికార వైసీపీ ఇంఛార్జుల కోసం దర్శనంలో కోటాను అమలు చేస్తున్నారని నేతలు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు.
మరోవైపు టీటీడీలో చేపట్టిన పనులకు సంబంధించి ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి కుటుంబానికి 1500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నేతలు స్పష్టం చేశారు. పాలకమండలి నిర్ణయాలను ఎందుకు ఆన్లైన్లో పెట్టటం లేదని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి అన్నారు.
ఈవో ధర్మారెడ్డి వైసీపీ కోసం వందల కోట్లను సేకరిస్తున్నారని తెలుగుదేశం నేత పట్టాభి ఆరోపించారు. ప్రత్యేక విమానం వేసుకుని మరీ బడా పారిశ్రామికవేత్తలను కలిసి నిధులు సేకరిస్తున్నట్టుగా ఆధారాలున్నాయని విమర్శించారు. కేంద్ర సర్వీసులోని అధికారులు 7 ఏళ్లకు మించి రాష్ట్రంలో కొనసాగే అవకాశం లేకపోయినా ధర్మారెడ్డి ఎందుకు ఉన్నారని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు. ధర్మారెడ్డిని ఈవో పదవి నుంచి తప్పించాలని ఈసీకి ఫిర్యాదు చేశామని పట్టాభి తెలిపారు.