LIVE: కుంకీ ఏనుగుల ఒప్పందంపై పవన్ కల్యాణ్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - PAWAN Kalyan on Kumki Elephants - PAWAN KALYAN ON KUMKI ELEPHANTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2024, 12:53 PM IST
|Updated : Sep 27, 2024, 1:15 PM IST
Karnataka Kumki Elephants for AP : రాష్ట్రంలో గజరాజుల దాడిని అరికట్టేందుకు కర్నాటక నుంచి 8 కుంకీ ఏనుగులు ఏపీకి రానున్నాయి. వీటిని మన్యం పార్వతీపురం, చిత్తూరు జిల్లాలకు తరలించనున్నారు. మన్యం ప్రాంతాలు, చిత్తూరు అటవీ ప్రభావిత ప్రాంతాల్లో ఏనుగుల గుంపు జనారణ్యంలోకి వస్తున్నాయి. తద్వారా జరుగుతున్న నష్టం, వాటి దాడులతో ప్రాణాలను కోల్పోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు.ఇందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అక్కడి అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖండ్రేతో పవన్ కల్యాణ్ ఇప్పటికే చర్చలు జరిపారు. ఏపీలో గజరాజుల దాడులు అరికట్టేందుకు కుంకీ ఏనుగుల ఆవశ్యకతను తెలియజేశారు. రాష్ట్రానికి 8 కుంకీ ఏనుగులు కావాలని కోరారు. నేడు దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు ఒప్పందం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గజరాజుల దాడులకు పరిష్కారం లభించినందుకు పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.
Last Updated : Sep 27, 2024, 1:15 PM IST