పిన్నెల్లికి బెయిల్ వచ్చే అవకాశం లేదు: న్యాయవాది సుంకర - Advocate Sunkara on Pinnelli Arrest - ADVOCATE SUNKARA ON PINNELLI ARREST
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 26, 2024, 8:01 PM IST
Advocate Sunkara Rajendra Prasad on Pinnelli Arrest: హైకోర్టు తీర్పు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెంపపెట్టని న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈవీఎంల ధ్వంసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. కీలక చట్టాలు చేసి ఇలాంటి అరాచకాలను అడ్డుకోవాలని ఈసీని కోరారు. పోలింగ్, తదనంతర ఘటనలను పరిశీలిస్తే పిన్నెల్లికి బెయిల్ వచ్చే అవకాశమే లేదని ఆయన ఎక్కువ కాలం జైల్లో ఉండాల్సి వస్తుందన్నారు.
ఈవీఎం ధ్వంసంతో పాటు మరో 3 కేసులకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పెట్టుకున్న బెయిల్ పిటిషన్ న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ క్రమంలో పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుబట్టడం కౌంటింగ్ తంతు కూడా ముగియడంతో తాజాగా ఆయన్ని అరెస్టు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పిన్నెల్ని అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం అక్కడ నుంచి మాచర్ల కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు.