ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు రెండేళ్లు శిక్ష విధిస్తే బాగుండేది: న్యాయవాది పలకా శ్రీరామ్మూర్తి - Dalit Shiromadanam case - DALIT SHIROMADANAM CASE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-04-2024/640-480-21239001-thumbnail-16x9-venkatayapalem.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 5:06 PM IST
Venkatayapalem Dalit Siromandanam Case: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో దళిత శిరోముండనం కేసులో న్యాయమూర్తి తుది తీర్పు వెలువడించారు. నిందితులుగా ఉన్నవారికి 18 నెలలు జైలు శిక్ష, రెండు లక్షలు వేరువేరుగా నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు నిచ్చారు. తీర్పు పట్ల ప్రజా సంఘాలు, వామ పక్షాలు, దళిత సంఘలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు యథేచ్ఛగా ఎన్నికలో పోటీ చేసే అవకాశం రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని న్యాయవాది పలకా శ్రీ రామమూర్తి వెల్లడించారు. ఘటన జరిగిన దగ్గరి నుంచి 2019 వరకూ ఈ కేసు 142 సార్లు వాయిదా పడిందని తెలిపారు ఈ కేసులో 2 సంవత్సరాల పాటు శిక్ష వేస్తే బాగుండేది, త్రిమూర్తులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయేవారు. ఈ తీర్పు ప్రకారం ఎమ్మెల్సీ త్రిమూర్తులు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి నేతల పదవుల నుంచి తొలగిస్తే న్యాయం జరిగేదంటున్న న్యాయవాది పలకా శ్రీ రామమూర్తితో మా ప్రతినిధి ముఖాముఖి.