కృష్ణపట్నం కంటైనర్​ టెర్మినల్​ను వ్యాపార ప్రయోజనాల కోసమే మూసేస్తున్నారు: సీఐటీయూ నేతలు - nellore port issue

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 6:49 PM IST

Adani is Turning Krishnapatnam Port Into a Dirty Port : అదాని యాజమాన్యం కృష్ణపట్నం పోర్టు కంటైనర్​ టెర్మినల్​ను తన వ్యాపార ప్రయోజనాల కోసం మూసివేస్తుందని సీఐటీయూ నేతలు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కంటైనర్​ టెర్మినల్​ను మూసివేసి బొగ్గు, బూడిద, ఐరన్​ఓర్​లాంటి వాటిని ఎగుమతి, దిగుమతి చేసి కాలుష్యభరితమైన పోర్టుగా మార్చేయాలని పన్నాగం పన్నిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పన్నాగానికి వంత పాడుతూ ఖజానాకు, ఉపాధికి గండికొట్టే చర్యలను ప్రొత్సహిస్తుందని నేతలు వ్యాఖ్యానించారు.

కంటైనర్​ టెర్మినల్​ తరలిపోతే వేలాదిమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కొల్పోతారని సీఐటీయూ నేత మోహన్​ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులకు గృహ, పరిశ్రమల అవసరమగు ఉపకరణాలు, విడిభాగాలు దిగుమతులకు అవకాశాలు కోల్పోతామని తెలిపారు. పోర్టుకు సమీపంలో నిర్మించిన గోదాములు కోల్డ్​ స్టోరేజ్​లు నిరుపయోగమైతాయని వాపోయారు. పోర్టులోని 14 బెర్తులను బొగ్గు, ఐరన్​ఓర్​, ఎరువులను హ్యాండ్లింగ్​ చేయడం వలన కాలుష్యం పెరిగి చుట్టుప్రక్కల గ్రామాల్లో నివాసాలు ఉండే పరిస్థితి లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటైనర్​ టెర్మినల్​ నిర్వహణ అక్కడ కొనసాగించాలని లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చారించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.