వైసీపీని ఓడించేందుకు తాడేపల్లిగూడెం సభ తొలి అడుగు: అచ్చెన్న - టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 7:30 PM IST
Achchennaidu Comments in Jenda Sabha in Tadepalligudem : సిద్ధమా అని రోడ్డెక్కిన వ్యక్తిని యుద్ధం చేసి ఓడించేందుకు తాడేపల్లిగూడెం వేదిక తొలి అడుగు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ' జెండా ' సభ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నామని పేర్కొన్నారు. జనంలో పుట్టినటువంటి టీడీపీ-జనసేన పొత్తు రాష్ట్రంలో చరిత్రను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ప్రజల కోసమే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నామని సృష్టం చేశారు.
కార్మికుడి నుంచి పారిశ్రామికవేత్త వరకు టీడీపీ - జనసేన పొత్తు కోరుకుంటున్నారని అచ్చెన్నాయుడు తెలియజేశారు. జగన్ పాలనలో మోసపోయిన రైతులు, యువత, నిరుద్యోగులు, మహిళలు కోరుకున్న పొత్తు అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెండు పార్టీలు కలిసి పని చేస్తే 160 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. టీడీపీ-జనసేన పార్టీల పొత్తును ప్రజలు దీవించాలని కోరుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందిలంటే టీడీపీ-జనసేన పార్టీలు అధికారంలోకి రావాలని ప్రజలకు సూచించారు.