సూర్యాపేట జిల్లాలో ఎక్సైజ్ అధికారులపై నిందితుల దాడి - ATTACK ON officers in Suryapet - ATTACK ON OFFICERS IN SURYAPET
🎬 Watch Now: Feature Video
Published : Mar 31, 2024, 9:58 AM IST
Accused Attack on Excise Officials : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కొత్తగూడెంలో ఎక్సైజ్ అధికారులపై దాడి జరిగింది. బెల్లం కేసులో నిందితులుగా ఉన్న గూగులోత్ తులసిరామ్, భూక్య సరస్వతిని అరెస్టు చేసేందుకు వారు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే అధికారులను అడ్డుకున్న నిందితులు ఘర్షణకు దిగారు. మమల్ని ఎలా అరెస్టు చేస్తారని వారితో వాగ్వాదానికి దిగారు. ఇద్దరు కానిస్టేబుళ్ల చొక్కాలు చింపి, గాయపరిచారు. అనంతరం రాళ్లు విసరడంతో అబ్కారీ వాహనం అద్దాలు పగిలిపోయాయి.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఓ ఇంట్లో దాడి చేయగా 5 క్వింటాల బెల్లం దొరికిందని అధికారులు తెలిపారు. దీనిపై ఆరా తీయగా తులసిరామ్‌ది అని తేలిందని చెప్పారు. ఇందులో భాగంగానే వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన తమపై దాడి చేశారని పేర్కొన్నారు. నిందితులు గతంలో కూడా కొన్ని రోజులు జైల్లో ఉన్నారని వివరించారు. ఈ ఘటనపై చింతలపాలెం స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.