నిర్లక్ష్యపు ప్రయాణం- వాగు దాటుతుండగా ప్రమాదం వైరల్ వీడియో - Young Man Washed Away in Stream - YOUNG MAN WASHED AWAY IN STREAM
🎬 Watch Now: Feature Video
Published : Sep 8, 2024, 9:51 PM IST
Young Man Washed Away in Stream : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వరద పోటెత్తి వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రజలకు ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడం ప్రాణ సంకటంగా మారింది. వాగులు దాటేటప్పుడు అరచేతిలో ప్రాణాలు పెట్టుకోని దాటాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో కొందరు ప్రవహిస్తున్న వాగును లెక్కచేయకుండా దాటడానికి ప్రయత్నించడంతో వాగులోనే కొట్టుకుపోతున్నారు. ఈ తరహా ఘటన ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే అల్లూరి జిల్లా పాడేరు మండలం రాయిగడ్డ వంతెన వద్ద ఓ యువకుడు గెడ్డ దాటే క్రమంలో మధ్యలో చిక్కుకుపోయాడు. వరద ఉద్ధృతిలో సుమారు గంటసేపు బైక్‌తోపాటు అలాగే ఉండిపోయాడు. అదుపుతప్పిన బైక్ కొట్టుకుపోతుండగా దాన్ని వదలకుండా పట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత బైక్‌తో పాటు యువకుడు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఆ తర్వాత కష్టపడి ఈదుకుంటూ ఒకవైపు చేరుకున్న యువకుడిని స్థానికులు కాపాడారు. వరద ఉద్ధృతి కనిపిస్తున్నా దాటేందుకు ప్రయత్నించడంపై యువకుడిని మందలించారు. విశాఖపట్నం మరిపాలెం తన స్వస్థలమని చెప్పిన సదరు యువకుడు తెలిపాడు.