బైక్​ స్టంట్స్ రీల్స్ చేస్తూ యువకుడు మృతి - తల్లడిల్లిన తల్లి ప్రాణం - Bike Stunts video

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 2:42 PM IST

Bike Stunts Ends In Tragedy in Hayathnagar: సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికి లైక్స్ కోసం రీల్స్ చేస్తూ యువకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో హయత్ నగర్ పరిధిలోని పెద్దఅంబర్​పేట్ సమీపంలో జాతీయ రహదారిపై వర్షంలో కేటీఎం బైక్​పై ఇద్దరు యువకులు స్టంట్స్ రీల్స్ చేసే ప్రయత్నం చేశారు. బైక్​తో స్టంట్స్ చేస్తుండగా అదుపుతప్పి బైక్ కిందపడిపోయింది. 

ఈ ఘటనలో శివ అనే యువకుడికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. డ్రైవింగ్ చేస్తున్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఈ ఘటన ఇరువురి కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. యువకుని మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విజయవాడ జాతీయ రహదారి పనులు కొనసాగుతుండటంతో జాతీయ రహదారిపై ఒక లైన్ మరమ్మతుల కోసం రోడ్లు వేసి వదిలివేయగా, ఆ రోడ్లపై యువకులు బైక్ లతో ఓవర్ స్పీడ్​లో వెళ్తూ రీల్స్ కోసం స్టంట్​లు చేయడంతో ఇలాంటి ఘటన చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న హయత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్లపై స్టంట్స్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.