మాదాపూర్లో రోడ్డు ప్రమాదం - ఎలక్ట్రిక్ బస్సు ఢీకొని యువతి మృతి - Road Accident In Hyderabad - ROAD ACCIDENT IN HYDERABAD
🎬 Watch Now: Feature Video
Published : Sep 14, 2024, 7:06 PM IST
A Women Dies After Being Hit By Electric Bus : హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి కొత్తగుడా చౌరస్తా నుంచి మాదాపూర్ వైపు నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న కలువ మాధవి (25)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు చక్రాల కింద పడి యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు గమనించి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. అక్కడి ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Road Accidents In Hyderabad : ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పోలీసులు కోరుతున్నప్పటికీ వినకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.