ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బైక్ దగ్ధం - తప్పిన పెను ప్రమాదం - A Bike Burnt in a Fire Sangareddy - A BIKE BURNT IN A FIRE SANGAREDDY
🎬 Watch Now: Feature Video
Published : Aug 30, 2024, 1:04 PM IST
Sangareddy Bike Fire Accident: ఓ ద్విచక్రవాహనం మంటల్లో పూర్తిగా దగ్ధమైన ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం కోడూరు వద్ద చోటుచేసుకుంది. కోడూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సంగారెడ్డిలో ఉన్న వారి బంధువుల ఇంటికి వెళ్లాడు. గురువారం (ఆగస్టు 29) రాత్రి వేళ తిరిగి తమ గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో బండి ఒక్కసారిగా ఆగిపోయింది.
భార్య పిల్లలను కిందకు దించిన శ్రీనివాస్ తన బైకును స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా ఆన్ అవ్వలేదు. బైక్‌లోని బ్యాటరీకి ఉన్న ప్లగ్ ను తీసి శుభ్రం చేసి మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్ లో పెట్రోల్ ఉండడంతో ఈ మంటలు క్షణాల వ్యవధిలోనే పూర్తిగా వ్యాపించడంతో బైక్ దగ్ధమైంది. వాహనంపై ఉన్న భార్య, పిల్లలను ముందుగానే దిగటంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మంట చెలరేగడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.