నంద్యాలలో రౌడీషీటర్ దారుణ హత్య - పాత కక్షలే కారణమా? - rowdy sheeter murdered in Nandyal - ROWDY SHEETER MURDERED IN NANDYAL
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-08-2024/640-480-22112863-thumbnail-16x9-rowdy-sheeter-was-brutally-murdered-in-nandyal.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 2, 2024, 7:41 PM IST
Rowdy Sheeter was Brutally Murdered in Nandyal : నంద్యాలలో దారుణం జరిగింది. పట్టణంలో కల్లూరి సాయి అలియాస్ కవ్వా అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నంద్యాల సమీపంలోని అయ్యలూరు మెట్ట - మసీదుపురం మెట్ట మధ్య ఓ వెంచర్ చివరిలో గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. సాయి ఇప్పటికే పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రెండేళ్ల క్రితం నంద్యాలలో జరిగిన కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడు. అప్పుడు కవ్వా సాయి మరో ముగ్గురితో కలిసి కానిస్టేబుల్‌ను వెంటాడి చంపారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అయితే ఇటీవలే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ హత్యాయత్నం కేసులోనూ సాయి నిందితుడిగా ఉన్నాడు. దీంతో సాయిపై రౌడీషీట్‌తోపాటు పీడీ యాక్ట్ నమోదు చేయడంతో ఏడాది పాటు జైల్లో ఉన్నాడు. అయితే పాత గొడవల కారణంగానే కవ్వా సాయిని హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన ప్రదేశాన్ని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, డీఎస్పీ రవీంద్రనాథరెడ్డి పరిశీలించారు.